Friday, April 13, 2007

మూడవ అధ్యయము

శ్రీ సాయిసచ్చరిత్రము
మూడవ అధ్యయము
సాయిబాబా యనుమతి - వాగ్దానము; భక్తులకు బాబా నియమించిన పనులు; బాబా కధలు సముద్రమధ్యమున దేపస్తంభములు; బాబా ప్రేమ - రోహిలా కథ; అమృతతుల్యములైన బాబా పల్కులు.

సాయిబాబా యెక్క యనుమతియు, వాగ్దానమును

వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీసాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచు ఇట్లు నుడెవిరి: "సచ్చరిత్ర వ్రాయు విషయములో నాపూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచొ నవిద్య అంతరించి పోవును. శ్రద్దాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామెహము క్షిణీంచిను. బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును."

ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదుగా సాగునను ధైర్యము కలిగెను. అటుపై ని మాధవరావు దేశపాండే(శ్యామా) వైపు తిరిగి బాబా యిట్లనెను:

"ప్రేమతో నా నామమునుచ్ఛరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నా పై పూర్తిగా నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములలో నన్ను నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారిని దుఃఖబంధనములనుండి తప్పిమ్తును. ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి, నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞపియందుంచుకొనువారు ప్రపంచవెషయములం దెట్లు తగులుకొందురు? వారిని మరణంనుండి బయటకు లాగెదను. నా కథలు వినిననో సకలరోగములు నివారింపబడును. కావున భక్తిశ్రద్దలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. అనందమునకు తృప్తికి నిదియె మార్గము. నా భక్తులయెక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలి వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్దచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. ’సాయి సాయి’ యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలను, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును.

భక్తులకు వేర్వేర్ పనులు నియమించుట

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, యఠములు, తీర్దములలో నదివోడ్డున మెత్లు బెదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాదుట్కు కోందరు నియుక్తులగుదురు. కొందరు తీర్దయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబ్డెనది. విషయజ్ఞానము శూన్యమగుటచే నీపని నా అర్హతకు మించినది. అయినచో, యింత కఠినమైన పని నేనందుకు అమెదించవలెను? నాయిబాబా జీవెతచరిత్రను వర్ణించగల వారెవ్వరు? నాయి యెక్క కరుణయే యింత కఠినకార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రకాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారము పరిహరించి, వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిఇబాబాకే చెందునుగాని నాకు గాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్ప్టికిని శ్రతి స్కృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయిసచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కాని చగవంతుని అనుగ్రహము మూగవానిని మట్లాడునట్లు చేయును కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును. తన యుచ్చానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము అ చగవంతునికే గలదు. హర్ంఓనియమునకుగాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచ్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వానివానివల్ల జరుగవు. అవి చంద్రొదయము వల్ల జరుగును.

బాబా కథలు దీపస్తంభములు

సముద్రమధ్యమందు దేపస్తభము లుండును. పడవలపై పోవుతారు అ వెలుతురుతో రాళ్ళు రప్పలవల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయానీంతురు. ప్రపంచమను యహసముద్రములో బాబాకథలను దీపములు దారి చూపును. అవి అమృతముకంటె తియ్యగానుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను, సుగమముగను చేయును.యెగీర్వరుల క్థలు పవిత్రములు. అవి మన చెవులద్తారా హృదయమందు ప్రవెశించునప్పుడు శరీరస్పృఅహయును, అహంకారమును, ద్వంద్వభావములును నిష్ర్కమించును. మన హృదయమందు నిత్వ్యుండెన సందేహములు పటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమై పోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీసాయిబాబాకిర్తి, వర్ణనలు ప్రేమతో పాడెనగాని వినిగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి యివియే మెక్షమునకు ములభసాధనములు. కృతయుగములో శయదయములు(అనగా నిశ్చలమనస్సు, శరీరము) త్రేతా యుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట, మెక్షమార్గములు. నాలుగు వర్ణములవారు ఈ చెవరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యెగము, యాగము, ధ్యానము, ధారణ్ము అవలంభించిట్ కష్టతరము. కాని భగవంతుని కీర్తిని యహిమను పాడుట్ యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుటవలన పాడుటవలని ననకు దేహభిమానము తొలగిపోవును. అది భక్తిలను నిర్మోహులుగ జేసి, తుదకు అత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సలభముగ చ్దువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు ననము చేసికొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తిపొంది యాత్మసాక్షాత్కారము సపాదంచగలుగుదుము. సచ్చరిత్రామృతము వ్రాయుట బాబా యెక్క కటాక్షము చేతనే సిద్దించనవి. నిమిత్తమాత్రుడుగనే యుంటిని.

సాయిబాబా యెక్క మాతృప్రేమ

అవు తన దుడనెట్లు ప్రేమచినో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును. దూడకు కావలసినప్పుడేల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు ఎల కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు లొడుగుటయందును, అలోకరించిటయందును తల్లి తగిన శ్రద్ద తీసికొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమియు తెలెయదుగాని, తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదెయు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడ నీ మాతృప్రేయ వారి శిష్యులందు చూపుదురు. సాయిఇబాబాకు గూడ నాయందట్టి ప్రేయ యుండెను. దానికీ క్రీంది యుదాహరణ్ అ మెకటి.

1916వ సంవత్స్రంలో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమినాదు ఇతరభక్తులలో నేను కూడ శిరిడికి పోయితిని. అణ్ణా చించణీకర్ నగురించి బాబాలో నిట్లనెను: " దయచేసి యీ అన్నసాహెబు యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పించను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురతను తీసి, నిశ్చింతను గలుగచెయుము." అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను: "వాని కింకొక ఉద్యోగము దొరుకును. కాని వడెప్పుడు నా సేవలో త్రప్తిపడ్వలెను. వాని భోజనపాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును. అవి ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టినంతటిని నావైపు త్రప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువలెను. అందరియెడల అన్కువ నమ్రతలిండవలెను. నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును."

నన్ను పూజింపుదనుదానిలోని ఈ ’నన్ను’ అనగా ఎవరు? అను ప్రశ్నకు సమాధానము యీ గ్రంథము యెక్క ఉపొద్ఘాతములో ’సాయిబాబా ఎవరు’ అనుశీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి యున్నది. చూడుడు!

రోహిలా కథ

రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిలా యెకడు బాబా కీర్తి విని అకర్షితుడై శిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు "అల్లాహు అక్బర్’ యని యాబోతు రంకెవేయునట్లు బిగ్గరగా నరుచుచుండెను. అందువలన పగలంతము పొలములొ కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన శిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళువరకు వారు దీనినోర్చుకొనిరి. తుదకు అ బాధ నొర్వ్లేక బాబా వద్దకేగి రోహిలా అరపుల నపుమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వెనిసపోవుటయే కాక వారిపై కోపించి వారిపనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించిరి. " రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, అమె గయ్యాళి యనియు, అమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచ్న్నదనియు, రోహిలా ప్రార్దనలు విని అమె ఏమి చేయలేక ఊరకయుండు" ననియు బాబా చెప్పెను. నిజమగా రోహిలాకు భర్యయే లేదు. భార్యయన్కగా దుర్భుద్ధియని బాబా భావము. బాబాకు అన్నిటికంటె దైవ ప్రార్దనలయందు మిక్కుట్మగు ప్రేయమ్. అందుచే రోహిలా తరపున వాదించి. ఊరిలోనివారి నోపిసతో నోర్చుకొని అ అసౌకర్యమును సగింపవలసినదనియు, నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ది చెప్పెను.

బాబా యెక్క యమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యాహ్న అరతి యయిన పిమట భక్తులందరు తమ తమ బసలు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా యీ క్రీంది చక్కని యుపదేశమిచ్చిరి:

"మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్ననూ నాకు తేలియునని బాగుగా జ్ఞాపసముంచుకొనుడు. నేనందరి హ్రుదయముల పాలించువాడను. అందరి హ్రుదయమమో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును న్డెపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణము సామరస్యమును నేనే, ఇంద్రయచలకుడను నేనే స్రష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే యమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారి కేహానిగాని బాదగాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్య్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే!"

ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో యే నౌకరీ కొరకు యత్నించక, గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని. కాని, అణ్ణా చించణీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండేను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచొడెను. భవిష్యత్తులో బాబా పలికిన పుకులు సత్యములైనవి. నకోక సకారు ఉద్యోగము కోరకెను. కాని అది కొద్దికాలము వరకే. అటుపిమ్మట వేరే పని యేదియు చేయక శ్రీసాయి సేవకు నా జీవతమంతయు సమర్పించితిని.

ఈ యధ్యాయమును ముగించుబోవుముందు చదువరలకు నేను చెప్పునదేయని, బద్దకము నిద్ర చంచలమనస్సు దేహాభిమానము మెదలగు వానిని విడిచి, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యెక్క రహస్యమును తెలికికొందురుగాక. ఇతర మార్గము లవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రోక్కుదురుగాక! అనగా శ్రీసాయి కథలను విందురు గాక! ఇది వారి యజ్ఞానమును నశింపచేయును. మెక్షమును సంపాదించి పెట్టును. లోభి యెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సోత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక!


శ్రీ సాయినాథాయ నమః
మూడవ అధ్యయము
సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు
శుభం భవతు

Thursday, April 12, 2007

రెండవ అధ్యయము

శ్రీ సాయిసచ్చరిత్రము
రెండవ అధ్యయము
ఈ గ్రంథమురచనకు కారణము, పూనుకొనుటకు అసమర్థత; బాబా అభయము; వాడాలో వివాదము; ’హేమడ్‍పంతు’ అను బిరుదు ప్రదానము; గురువు యొక్క యావశ్యకత.


మొదటి యధ్యాయములో గోధుములు విసరి యాపిండిని ఊరుబమట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క యితరమహిమలు విని సంతోషించితిని. అ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలును చర్యలనుమనస్సున కానందము కలుగచేయును; అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును; తుదకు పాపములను బోగొట్టును గదా యని భావించి బాబా యొక్క ప్రవిత్ర జీవితమును, వారి బోధనలను ప్రాయమొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును, అధ్యాత్మికమునునైన మార్గమును జూపును.

గ్రంథమురచనకు పూనుకొనుటకు అసమర్థత - బాబా అభయము:

శ్రీ సాయిసచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్దతగలవాడను కానని హేమడ్‍పంతు భయపడెను. అతడిత్లనుకొనెను: " నా యొక్క సన్నిహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకునది ఇట్టి స్థితిలో ఒక యోగిశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతారపురుషుల లక్షణముల నెట్లూ వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిన గాని యోగి యెక్కయు జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్తసముద్రముల లోతును గొలువవచ్చును. అకాశామును గుడ్లో వేసి మూయవచ్చును. కాని యోగిశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహాసకృత్యము కూడ నాకు తెలియును." అందువలన నలుగురిలో నవ్వులపాలగుదునేమెనని భయపడి శ్రీసాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్దించెను.

మహరాష్ట్ర దేశములోని ప్రథము కవియు, యోగిశ్వరుడునగు జ్ఞానేశ్వరమహరాజు యోగులచరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగులచరిత్రను వ్రాయ కుతూహలపడెదరో వారి కొరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనిసాగునట్లు చేయుటకు యోగులనేకమార్గముల నవలంబించెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రనిగా నుంచి వారివారి కార్యములెను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగిశ్వరుల చరిత్ర వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి అ కార్యమును కొనసాగించిరి. అట్లే. 1800 శక సంవత్సరములో దాసుగణు యెక్క సేవను అమోదించిరి. మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతములోని 31, 32, 33 అథ్యాయములందును, సంతస్థామృతములోని 57వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపమదినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచిక 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీసాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రీబాయి రాఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసుగణు మహరాజుగారు. కూడ శ్రీసాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవాని మెహతా యను భక్తుడు శ్రీసాయి కథలను ముద్రించినారు. సాయినాథప్రభ అను మాసపత్రిక శిరిడీలోని దక్షిణభిక్ష సంస్థవారు ప్రచురించి యున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్రవ్రాయుటకు కారణమేమి? దాని యవసరమేమి? - యనిఎవరైనను ప్రశ్నింపవచ్చును.

దీనికి జవాబు మిక్కిలి తేలిక! సాయిబాబా జీవితచరిత్ర సముద్రమువలె విశాలమైనది, లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తిజ్ఞానములను మణులను వెలెకితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును. శ్రీసాయిబాబా నీతిబోధమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందినవారికి విచారగ్రస్టులసు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్దిని ఇచ్చును. వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రబోధములు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి, అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల అనందము కలుగజేయును. అందుచేత బాబాగారి యాత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, బోధనలు సమకూర్చుటసు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునసు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.

నా యంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్దించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. ’నేను భిక్షాటినముచే జీవించు ఫకీరును, నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేద్’ని యనవద్దు! మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయౌను. మీ యెక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదెయు జయప్రదము చేయలేము." అది వినినంతనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు (శ్యామతో) నిట్లు చెప్ప దొడంగెను: " కథలను, అనుభవములను, ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తులు కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టువలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరొ వారికి నేను మిక్కిలి సహయపడెదను. నా జీవితచర్యలకొరకే కాదు. సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడేదను.వాని యహంకారము పూర్తిగా పడెపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండునప్పుడు నేను వని మనస్సులో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్నా భక్తులకు భక్తివిశ్వాసములు కుదురును, వారు అత్మసాక్షాత్కారమును బ్రహ్మనందమును పొందెదరు. నీసు తోచిన దానినే నీవు నిర్దారంణ చేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయముపై నైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు.

వివాదమునగనే నన్ను ’హేమడ్‍పంతు’ ని పిల్చుటకు కారణమేమె మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకాసాహెబు దీక్షత్, నానాసాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను శిరిడి పొయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్యలోనేదో గరిజినది. అది నా శిరిడి ప్రయాణమున కడ్డుపదేనది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగంచెను గాని నిష్పలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయెజనము లేకుండెను. ఈ సంగతి విని, "నా స్నేహితుని కుమారుని రక్షంచలేనట్టి గురువు యెక్క ప్రయెజనమేమి? గురువు మనకు ఏమియు సహొయము చేయలేనప్పుడు నేను శిరిడి యేల పోవలెను?" అని భావించి, శిరిడీ ప్రయాణము మానుకొంటిని. కాని కానున్నది కాకమానదు. అది యీ క్రింది విధముగా జరిగెను.

నానాసాహెబు చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యు అధికారి. ఊద్యొగరీత్య యెకనాడాయ వసయీకి పర్యటనకై పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి యచ్చట వసయీ పోవు బండికొరకు కనిపెట్టుకొని యుండెను. ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి, నన్ను పిలిపించి శిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా సంతోషదాయకముగను సమ్మతముగాను ఉండెను. స్ందుచే నా రాత్రియే శిరిడీకి పోవ నిశ్చయించితిని. సామానులు సట్టుకొని శ్రిడే మయలుదేరితిని. బాంద్రా నుండే దాదరు వెళ్ళి, అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటులనే దాదరుసు టిక్కట్టు కొని, రైలు రాగానే ఎక్కి కూర్చ్ంటిని. బండి ఇక మయలు దేరుననగా, యహమ్మదీయుడొకడు నేను కూర్చోనిన పెట్టెలోనికి హడావిడిగా వచ్చి, నా సరంజామానంతయు జూచి, యెక్కడసు పోవుచంటివని న్న్న ప్రశ్నిమ్చెను. నా యాలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదరు స్టేషనులో దెగవద్ద్నీ, ఎందుకనగా యన్మాడుమెయిలు దాదరులో అగ్దనీ, అదే రైలులో ఇంకనూ ముయ్ందుకుబోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాసు మలహ చెప్పెను. ఈ చిన్న లీలయే జరుగకుండినచో నేననుకొనెన ప్రకారము అ మరుసటి ఉదయము శిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక సందేహములు కూడ కలిగి యుండెడివి. కాని నా యదృష్టవశాత్తు యది యట్లు జరుగలేదు. మరుసటి దెనము సుమారు 9-10 గంటలలోగా నేను శ్రిడీ చేరితిని. శిరిడీలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.

ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి నాఠేవాడా యెక్కటియే శ్రిడీ వచ్చు భక్టుల కోరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే బాబా దర్శించవలెనని నాకు అత్రము కలిగెను. అంతలో, అప్పుడే మసీదునుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు, బాబా వాడాచివరన ఉన్నారనియూ, మెట్టమెదట ధూళిదర్శనము చేకుకొనమని నాకు సలహ యిచ్చెను. స్నాననంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినినలోడ్నే నేను పోయు బాబా పాదములసు సాష్టాంగనమస్కారము చేసితిని. నాలో అనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందొర్కరు చెప్పినదానికన్ననూ ఎన్నోరెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు యరచితిని. మనస్సు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పటిన వెంటనే న జీవితములో గొప్ప మార్పు కలిదెను. నాకు శిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికి నేనెంత ఋణపదీనట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహిగులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను, వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనస్సులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటికర్మల బలము తగ్గును. క్రమమగా ప్రపంచమందు వరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబా చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను.

తీవ్ర వాగ్వివాదము:

నేను శిరిడీ చేరిన మెదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యెక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్వవాదము జ్రిగెను. మన స్వేచ్చను విడిచి యింకొకరికి ఎందుసు లొంగియుండవలెనని నేను వాదించితిని. "మన కర్మలను మనమే చేయుటకు గురువు యెక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి, మిక్కిలి యత్నముతో యీ జన్మదుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియు చేయక సోయరిగా కూర్ఛొనువానికి గురువేమి చేయగలడు?" అని నేను స్వేచ్చపక్షమును అశ్రయించితిని. భాటే యింకొక వాదమును బట్టుకొని, ప్రారబ్దము తరపున వాదించుచు, "కానున్నది కాక మానదు. మహనియులు కూడ నీ విషయములో నోడిపోయిరి. మనుజుడోకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుందానిమ్ము. గర్వముగాని యహంకారము కాని మీకు తోడ్ప్డ్వు" అనెను. ఈ వాదన యెక గంట వరకు జరిగెను. కాని యిదమిత్థమని యేమియూతేలలేదు. అలసిపోవుటచె ఘర్షణ్ మానుకొంటిమి. ఈ ఘర్షణ్వల్ల నా మనఃశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ది, అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని. వేయేల, వివాదమునకు మూలకారము.

ఇతరతో కూడ మేము మసీదునసు పోగా, బాబా కాకాను బిలిచి యిట్లుడిగెను: "వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్‍పంతు ఏమనుచున్నాడు?"

ఈ మాటలు విని నేను అశ్చర్యపడితిని. సాఠేవాడా మసీదునకు చాలా దూరముగా నున్నది. యా వివాదముగూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞడై యుండవలెను. లేనిచో మావాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియై యుండవచ్చును.

హేమడ్‍పంతు అను బిరుదునకు మూలకారణము

సాయిబాబా నన్నెందులకు ’హేమడ్‍పంతు’ని పిలిచెనని అలోచింపసాగితిని? ఇది ’హేమడ్‍పంతు’ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవవంశ రాజులకు హేమద్రిపంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వ్గర చింతామణి, రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు; మెడి భాషను, ఒక నూతన గణిత వెధానమును కని పెట్టినవాడు. ఇక నేనా? వానికి వ్యతిరేకబుద్ది గలవాడ్ను, మేధాశక్తి యంతగా లేని వాడను. యరి, సాయిబాబా నాకెందుకీ ’బిరుదు’ నొసంగిరో తెలియకుండెను. అలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకోక యమ్మనియు, నేనెప్పుడును అణుకువ నమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయయి యుండ్వచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో గరిజిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా యీ రీతిగా అభినందించియుండవచ్చని యనుకొంటిని.

భవిష్యచ్చరితము బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోళ్కరును "హేమడ్‍పంతు" అనుట) గోప్పి ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిదియే బాబా యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమడ్‍పంతు శ్రీసాయిబాబా సంస్థానము చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యెక్క లెక్కలను బాగుగ నుంచెను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యమెహము, అత్మశరణాగతి, అత్మసాక్షాత్కారము మెదలగు విషయములతో శ్రీసాయి సచ్చరిత్ర యును గొప్ప గ్రంథము రచించెను.

గురువు యెక్క యావశ్యకత

ఈ విషయమై బాబా యేమనెనో హేమడ్‍పంతు వ్రాసియుండ లేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రచురించును. హేమడ్‍పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షీత్ బాబావద్దకు వచ్చి "శిరిడి నుండి వెళ్ళ వచ్చునా" యని యడిగెను. బాబా యట్లేయని జవాబిచ్చెను. "ఎక్కడకు" అని ఎవరో యడుగగా, "చాలా పైకి" అని బాబా చెప్పెను. "మార్గమేది" యని దీక్షిత్ యడిగెను. "అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. శిరిడి నుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయసకరమైనది. మార్గమధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళ కల"వని బాబా బదులిడెను. "మార్గదర్శకుని వెంటదీసిలకొని పోయినచో" నని కాకాసాహెబు యడుగగా, "అట్లయినచొ కష్టమే లేద’ని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు, గోతులనుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మశీదులో అప్పుడచ్చటనే యున్న దాభోళ్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా? యను వివాదము వలన ప్రయెజనము లేదని గ్రహించెను. పరమార్దము నిజముగా గురుబోధలవల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వసిష్ఠసాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము (నిష్ఠ), ఓపిక (సబూరీ) యను రెండు గుణములు అవశ్యకమనియు గ్రహించెను.




శ్రీ సాయినాథాయ నమః
రెండవ అధ్యయము
సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు
శుభం భవతు